నిమిషానికి ఏడు వందల సబ్బులు: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నిమిషానికి ఏడు వందల సబ్బులు: కేటీఆర్

April 5, 2022

ffdtn

తెలంగాణలో రూ. 6 కోట్లతో యూత్ హబ్‌ను ఏర్పాటు చేసినట్లు సోమవారం హైదరాబాద్‌లోని తారామతి భార‌ద‌రి రిసార్ట్‌లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేష‌న్ ఛాలెంజ్ 2021-22 కార్య‌క్ర‌మంలో మంత్రి కేటీఆర్ తెలిపారు. బాలలకు, యువతకు నూతన ఆవిష్కరణల కోసం, కొత్త విద్యావిధానల రూపకల్పనే లక్ష్యంగా ఈ హబ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం మరో సంస్థను కేటీఆర్ ప్రారంభించారు. విప్రో సంస్థ త‌న కంపెనీకి చెందిన సబ్బుల త‌యారీ యూనిట్‌ను రూ.300 కోట్లతో హైద‌రాబాద్ శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను విప్రో ఫౌండ‌ర్ చైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీతో క‌లిసి మంత్రి కేటీఆర్ కాసేప‌టి క్రితమే లాంఛ‌నంగా ప్రారంభించారు.

అయితే, మ‌హేశ్వ‌రంలో అత్యాధునిక టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన.. ఈ యూనిట్‌లో సంతూర్ స‌బ్బుల‌తో పాటు, సాఫ్ట్ ట‌చ్ ఫ్యాబ్రిక్ కండిష‌న‌ర్‌ల‌ను విప్రో ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ స‌బ్సుల‌ను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా స‌బ్బుల ఉత్ప‌త్తిని చేప‌ట్ట‌నుండ‌టం ఇదే తొలిసారి అని కూడా ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని, అందులో 90 శాతం మంది స్థానికులేన‌ని కేటీఆర్ తెలిపారు.