అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ అవుతున్న 7 సినిమాలు - MicTv.in - Telugu News
mictv telugu

అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్ అవుతున్న 7 సినిమాలు

May 15, 2020

gngn

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడ్డాయి. ఇక తిరిగి థియేటర్స్ ఎప్పడు ప్రారంభమౌతాయో తెలియని పరిస్థితి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను దర్శక నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్, హాట్ స్టార్, జీ5 మొదలగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ భారీ ప్రకటన చేసింది. ఏడూ భారతీయ చిత్రాలను నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తునట్టు ప్రకటించింది.

 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ కానున్న సినిమాలు..

 

  1. గులాబో సితాబో (హిందీ)

విడుద‌ల తేదీ – జూన్ 12, 2020

నటీనటులు – అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా

రచన – జూహి చతుర్వేది

దర్శకత్వం – సూజిత్ సర్కార్

నిర్మాత‌లు – రోన్ని లాహిరి, శీల్ కుమార్ 

 

  1. శకుంతలా దేవి (హిందీ)

విడుద‌ల తేది – ఇంకా ప్రకటించలేదు.

నటీనటులు – విద్యా బాలన్

ర‌చన – నాయనిక మహ్తాని, అనూ మీనన్

దర్శకత్వం – అనూ మీనన్.

నిర్మాత‌లు – అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా

 

  1. లా (కన్నడ)

విడుద‌ల తేది – జూన్ 26, 2020.

నటీనటులు – రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు

రచన, దర్శకత్వం – రఘు సమర్థ్

నిర్మాతలు – అశ్విని, పునీత్ రాజ్ కుమార్

 

 

  1. ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)

విడుద‌ల తేది – జూలై 24, 2020

నటీనటులు – డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్

రచన – అవినాశ్ బాలెక్కాల

దర్శకత్వం – పన్నాగ భరణ

నిర్మాతలు – అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్

 

 

  1. సుఫియాం సుజాతాయం (మలయాళం)

విడుద‌ల తేది – ఇంకా ప్రకటించలేదు

నటీనటులు – అదితి రావు హైదరీ, జయ సూర్య

రచన, దర్శకత్వం – నరని పుజా షానవాస్

నిర్మాణం – విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్

 

 

  1. పొన్ మగల్ వంధల్ (తమిళం)

విడుద‌ల తేది – మే 29, 2020

నటీనటులు – జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్

రచన, దర్శకత్వం – జె.జె. ఫ్రెడరిక్

నిర్మాతలు – సూర్య శివకుమార్, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్

 

 

  1. పెంగ్విన్ (తమిళం, తెలుగు)

విడుద‌ల తేది – జూన్ 19, 2020

నటీనటులు – కీర్తి సురేశ్

రచన, దర్శకత్వం – ఈశ్వర్ కార్తీక్

నిర్మాత‌లు – స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్