ఇద్దరు మినహా మంత్రులంతా ఓటమి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇద్దరు మినహా మంత్రులంతా ఓటమి..

October 24, 2019

Seven ministers, State BJP chief, assembly speaker trailing in haryana

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీ పార్టీకి మిశ్రమ ఫలితాలు వెలుబడ్డాయి. దీంతో అధికారం నిలుపుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ పార్టీ 40 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే 46 స్థానాలు గెలవాల్సి ఉంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, మంత్రి అనిల్ విజ్‌లు మినహా మిగతా ఏడుగురు మంత్రులు ఓటమిపాలయ్యారు. అలాగే హరియాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కాన్వార్ పాల్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించగా, జేజేపీ 10 స్థానాల్లో, ఇతరులు పది స్థానాలు గెలుచుకున్నారు. దీంతో హరియాణాలో హంగ్ ఏర్పడింది.