Home > Featured > 7 భారీ గుప్తనిధులు ఇవే.. హైదరాబాద్‌లో ఒకటి

7 భారీ గుప్తనిధులు ఇవే.. హైదరాబాద్‌లో ఒకటి

Seven most valuable treasures.

సకల సంపదలకు పుట్టిల్లు భారతదేశం. ప్రాచీనకాలంలో అటు ఇరాక్ నుంచి ఇటు తూర్పున జపాన్ వంటి ఎన్నో దేశాలతో వాణిజ్యం చేసింది. నానా రాజవంశాలు తమ సామ్రాజ్యాలను భరతఖండం దాటి విస్తరించాయి. చంద్రగుప్తుడి నుంచి ఆఖరి నిజాం రాజు వరకు కోట్ల సంపదను పోగు చేశారు. కొందరు తమ సంపద శత్రువులకు చిక్కకుండా రహస్య ప్రదేశాల్లో దాచారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇలాంటి గుప్తనిధులు అనేకం ఉన్నాయంటారు. కేరళలోని అనంత పద్మనాభస్వామి గుడిలో వెలకట్టలేని సంపద వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఒక్క అనంతుడి వద్దే కాదు, దేశంలో ఎన్నో చోట్ల గుప్త నిధులు ఉన్నాయి! కొన్నిటికి స్పష్టమైన ఆధారాలు ఉండగా, కొన్ని కేవలం జనం చెప్పుకునే కథల్లో మాత్రమే ఉన్నాయి. మనదేశంలో ప్రసిద్ధిగాంచిన అమూల్య సంపదల్లో ఏడింటి గురించి చెప్పుకుందాం. వీటిలో హైదరాబాద్ పాత బస్తీలోని నిధి కూడా ఒకటి.

అల్వార్ కోట, ( రాజస్థాన్)

tt

మొగల్ చక్రవర్తి జహంగీర్.. అల్వార్ కోటలో ప్రవాస జీవితం గడిపినప్పుడు తన సంపదను కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి తరలించాడు. అతని సంపదలో కొన్ని నగలు, కళాఖండాలు పరిశోధకులకు లభించాయి. అయితే దొరకని సంపదే ఎక్కువ. సంపదను తర్వాతి రాజులు కైవసం చేసుకున్నారని అంటారు. అయితే జహంగీర్ రహస్య స్థావరంలో సంపదను ఉంచారని, దాన్ని ఎవరూ కనుగొనలేదని కూడా మరో వాదన ఉంది.

జయగఢ్ కోట, (జైపూర్, రాజస్తాన్)

gt

రాజపుత్ర రాజు మొదటి మాన్ సింగ్ ఇక్కడి నుంచి పాలించాడు. అతని ఖజానాలో విలువైన నగలు, వజ్రాలు, నాణేలు ఉండేవి. అఫ్గానిస్తాన్ పై దాడి చేసి తెచ్చిన సంపదను ఈ కోటలో దాచాడు. వీటిలో కొన్ని లభ్యం కాగా, చాలా భాగం మిస్టరీగానే ఉండిపోయింది.

మూకాంబికా ఆలయం, (కొల్లూరు, కర్ణాటక)

tt

పశ్చిమ కనుమల్లో కొలువైన మూకాంబికా అమ్మవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. విజయనగర రాజులు ఈ గుడిని పునరుద్ధరించారు. అమ్మవారికి భారీగా బంగారం, ఆభరణాలు కానుకలుగా సమర్పించారు. ఆలయంలోని ఓ రహస్య గదిలో అమూల్యమైన సంపద ఉందని ప్రతీతి. ఆ నిధికి కాళనాగులు కాపలా కాస్తుంటాయని చెబుతారు.

చార్మినార్ సొరంగం (హైదరాబాద్)

tt

కుతుబ్ షాహీల పాలనలో హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా వెలుగొందింది. పలు దేశాల రాయబారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. గోల్కొండ నుంచి చార్మినార్ వరకు ఉన్న రహస్య సొరంగంలో అంతులేని సంపద ఉందని అంటారు. అయితే ఈ సొరంగం కచ్చితంగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. పాతబస్తీలో, గొల్కొండ పరిసరాల్లో కొన్ని సొరంగాలు వెలుగు చూసినా, అవన్నీ 50 అడుగు, వంద అడుగుల వరకు మాత్రమే ఉన్నాయి.

అనంత పద్మనాభస్వామి ఆలయం (కేరళ)

rr

ఈ గుడిలోని సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుప్రీం కోర్టు దాకా వెళ్లిన ఆలయ సంపద 22 బిలియన్లు (రూ. 15 వేల కోట్లు) ఉంటుందని అంచనా వేశారు. గుడిలో మరో నేలమాళిగను ఇంకా తెరవలేదు. అందులో కళ్లు తిరిగే సంపద ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు వెలుగు చూసిన సంపదలో బంగారం, వజ్రాలు, వెండి నాణేలు, విగ్రహాల, ఆభరణాలు ఉన్నాయి.

కృష్ణానది లోయ( ఆంధ్రప్రదేశ్)

tt

వజ్రాలకు నెలవు. ప్రఖ్యాత కోహినూర్ వజ్రమే కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పది వజ్రాల్లో ఏడు ఈ లోయలోనే దొరికాయి. కృష్ణమ్మ ఎగువ రాష్ట్రాలనుంచి మట్టితోపాటు ఎన్నో విలువైన వజ్రాలను తీసుకొస్తుంటుంది. అయితే చాలావరకు నదీగర్భంలోనే ఉండిపోతాయి. వీటికోసం ఎంత వెతికినా ఫలితం ఉండదు. ఇది ప్రకృతి దాచుకున్న గుప్తనిధి. ఏపీలోని వజ్రకరూరు ప్రాంతంలోనూ వజ్రాలు బయటపడుతుంటాయి.

సోన్ భండార్ గుహలు(రాజ్‌గిరి, బిహార్)

tt

పేరులోనే ఉన్నట్లు ఈ గుహల్లో బంగారం గుట్టలు ఉన్నాయంటారు. నిధిని కొన్ని మానవాతీత శక్తులు కాపాడుతున్నాయని ప్రజల విశ్వాసం. అక్కడి ఓ ద్వారంపై లిఖించిన రాతను అర్థం చేసుకుంటే ద్వారం తెరుచుకుంటుందని చెబుతారు. అయితే ఓ గుహపై కనిపించిన గుప్తరాజుల శాసనాలను పరిశోధకులు ఇప్పటికే చదివారు. అయితే నిధి ఉన్న గుహ అది కాదని అంటారు.

Updated : 17 Aug 2019 8:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top