నిమ్స్‌పై కరోనా పంజా..ఏడుగురు వైద్యసిబ్బందికి పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

నిమ్స్‌పై కరోనా పంజా..ఏడుగురు వైద్యసిబ్బందికి పాజిటివ్

June 3, 2020

nims

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ విధించిన సంగతి తెల్సిందే. లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మాత్రం ఇళ్లనుంచే పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మాత్రం కరోనాను అరికట్టడానికి అహర్నిశలు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎందరో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా బారినపడి మరణించారు. 

తాజాగా పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలోని‌ కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు వైద్యులు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. అలాగే, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది పీజీ వైద్య విద్యార్థులకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తోంది. దీంతో హాస్టల్‌లో ఉంటున్న 284 మంది విద్యార్థులను అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ఈ అంశమై ఈరోజు జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలువనున్నారు.