తెలంగాణకు 70 వేల కోట్ల నష్టం.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణకు 70 వేల కోట్ల నష్టం..

July 15, 2020

Seventy thousand crore loss to telangana

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం దాదాపు రెండు నెలలు లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెల్సిందే. దీంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్ని స్తంభించిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడిప్పుడే వ్యాపార కార్యకలాపాలు ఉపందుకున్నాయి. తాజాగా లాక్ డౌన్ మిగిల్చిన నష్టంపై సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) సర్వే చేసింది. లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రజలు దాదాపు రూ.70 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని సెస్ అంచనా వేసింది.

ఈ నష్టం రాష్ట్ర జీఎస్డీపీలో 7.9% అని తెలిపింది. లాక్‌డౌన్‌లో రోజుకు రూ.1,784 కోట్లు నష్టం జరిగిందని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో కీలకమైన నిర్మాణ, ఉత్పాదక రంగాలు లాక్‌డౌన్‌ ప్రభావానికి ఎక్కువగా గురయ్యాయని తెలిపింది. అలాగే లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని సెస్ రిపోర్టు తేల్చింది. మాన్యుఫాక్చరింగ్‌, ఎంఎస్‌ఎంఈ, సర్వీసు రంగాలతోపాటు రియల్‌ రంగంపై ఆధారపడ్డ కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యారని విశ్లేషించింది. నిర్మాణరంగంలో పనిచేస్తున్న 13,08,535 కూలీలు ఈ మేరకు తమ ఉపాధి నష్టపోయారని స్పష్టమైంది.