హైదరాబాద్ టైమ్సాఫ్ ఇండియా ఎడిటర్.. ఓ కామపిశాచి.. ఉద్యోగినులు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ టైమ్సాఫ్ ఇండియా ఎడిటర్.. ఓ కామపిశాచి.. ఉద్యోగినులు

October 8, 2018

లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం గోముఖవ్యాఘ్రాల తోలు వలిచేస్తోంది. కాస్త గౌరవమర్యాదలు ఉంటాయని భావించే మీడియా రంగంలోనూ బుసలు కొడుతున్న కామాంధుల బండారాన్ని బయటపెడుతోంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఏడుగురు ఉద్యోగులు ఆరోపించారు.

trtt

‘నన్ను లిక్ చేయి.. రుచిగా ఉంటుంది.. అంటూ అతడు మాకు అత్యంత అసభ్య మెసేజీలు పెడుతున్నాడు. సైగలు చేస్తున్నాడు.. మానసికంగా వేధించడంతోపాటు అసభ్యంగా తాకుతున్నాడు..మీద పడుతున్నాడు’ అని అతని చాటింగ్, ఇతర వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతడు తనను మానసికంగా వేధించాడని, సెలవులు తర్వాత తాను తిరిగి విధుల్లో చేరాలంటే భయమేస్తోందని సంధ్యా మీనన్ అనే ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ గోవా రెసిడెంట్ ఎడిటర్ గా పని చేసినప్పుడు తనను కూడా వేధించాడని మరో యువతి తెలిపింది. ఈ మేరకు బాధితులు ఆన్ లైన్‌లో పిటిషన్ పెట్టి, అతణ్ని విధుల నుంచి తప్పించాలని యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.