విటుడు హాయిగా బతికేస్తుండు ఎందుకు..? - MicTv.in - Telugu News
mictv telugu

విటుడు హాయిగా బతికేస్తుండు ఎందుకు..?

July 19, 2017

1) సెక్స్ వర్క్ చేస్తూ పోలీసులకు దొర్కిన అమ్మాయిలు సంవత్సరాల తరబడి జైళ్లల్లో లేదా ఉజ్వల హోముల్లో మగ్గుతున్నారు..!కానీ ఆ సెక్స్ వర్కర్ తో  పట్టుబడిన విటుడు మాత్రం హాయిగా కుటుంబాలతో ఉంటూ మళ్లీ ఇంకో సెక్స్ వర్కర్ దగ్గరకు వెళుతూనే ఉన్నాడు…

2) ఏ..సంస్కరణ అనేది  అమ్మాయిలకేనా..వాళ్లతో పట్టుబడిన మగాళ్లకు అవుసరంలేదా ? రిహాబిలిటేషన్ పేరుతో ఆడవాళ్ళని మాత్రమే సంవత్సరాల    తరబడి హోముల్లో ఎందుకు మగ్గబెడుతున్నారు.???

3) శరీరాలను అమ్ముకుంటే తప్ప పూట గడవని పేదలున్న ఈ దేశంలో..పేదరికాన్ని రూపు మాపకుండా వ్యభిచారాన్ని  నిర్మూలిస్తామనడం  హాస్యాస్పదమే.

4) అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..సెక్స్ వర్కర్లు ఒక్కలే వ్యభిచారం చెయ్యలేరు..అక్కడ మగాడుంటేనే వ్యభిచారం మరి మగాళ్లనెందుకు శిక్షించరు?

ఇవి….సత్యవతి కొండవీటి  అనే మేడం ఫేసుబుక్కులో నేటి సమాజానికి, పాలకులకు సంధించిన  ప్రశ్నలు.నిజమే  మీ అంతరంగం అక్షరాల నిజం సత్యవతి గారు,గతంలో కూడా మనం ఇలాంటివి చాలా చూశాం,పలానా హోటళ్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ప్రముఖులు అనే విషయం బయిటికి వస్తుందే తప్ప ఆ ప్రముఖుడుమీద చిన్న క్లూ కూడా బయటికి రాదు,తప్పు చేసినపుడు  అమ్మాయితో పాటు మగాళ్లకూడా చూపించాలి కదా?పరువనేది మగాడికేనా ఆడదానికి లేదా ?మరెందుకు ఈ సమాజం ఆడదాని పరువు తీస్తుంది..మగాడి పరువుని దాస్తుంది..?అసలు మగాడనేవాడు లేకపోతే  ఆడది వ్యక్తిగతంగా చెడిపోదు అనేది అక్షర సత్యం..మరి అంత కీలకమైన వాళ్లను వదిలేసి ఆడవాళ్లనే టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం..వ్యభిచారంలో దొరికిన ఆడవాళ్లు  జైళ్లలో ఉజ్వల హోమ్స్ మగ్గిపోతుంటే ..విటుడు మాత్రం ఎందుకు హాయిగా బతికేస్తుండు ?ఇది నిజంగా మన మందరం ఆలోచించదగిన విషయమే.

ఆడవాళ్లు వ్యభిచార వృత్తిలోకి ఎందుకు..?

అసలు ఒక ఆడది తనకు ఎంతో పవిత్రమైన శీలాన్ని కూడా అపవిత్రం చేసుకోవడానికి సిద్దపడుతుంది అంటే..దాని వెనకున్న  అసలు కారణాలు ఏంటి ?వాళ్ల కుటుంబ పరిస్ధితులేంటి?వాళ్ల మానసికి పరిస్ధితి ఏంటి?ఇవేవి ఎవ్వరికి అవుసరంలేదు, వ్యబిచారం చేస్తూ పట్టుబడితే చాలు వాళ్లని సమాజం చులకనా భావంతో చూస్తుంది,మరి వాళ్లతో కలిసి వ్యభిచారం చేసి దొర్కకుండా తప్పించుకొని,ఒకవేళ దొరికినా తమ పలుకుబడితో తప్పించుకొని  దర్జాగా సమాజంతో తిరిగితే వాళ్లు పెద్దమనుషులు ఏం తెల్వని సత్తె పూసలు,దొరికిన ఆడవాళ్లను సంస్కరణ పేరుతో మూడు నాలుగేండ్లు ఉజ్వల గదుల్లో బందించచ్చు,మగాడు మాత్రం  మరో సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్లి తన వాంఛ తీర్చుకోవచ్చు,వ్యభిచారం చెయ్యడం తప్పే  కానీ ఆ తప్పులో భాగసామ్యం పంచుకునే  ఆడదాని పేరుతో పాటు మగాడి పేరుని కూడా బయటిపెట్టి  వాళ్లను కూడా సంస్కరణ పేరుతో ఉజ్వల హామ్స్ లలో వేసి.వాళ్లకు కూడా శిక్షలు వేస్తే …అప్పుడు  మగాడు అనేవాడు రాకపోతే అసలు ఆడది సెక్స్ వర్కర్ గా మారాల్సిన అవసరం ఏముంది.ఇది సత్యవతి కొండవీటి గారి అంతరంగం..ఆమె మాటలతో  మీరు ఏకీభవిస్తారా ?