Sexual assault on Telugu actress in the name of Pendli..finally
mictv telugu

తెలుగు హీరోయిన్‌పై లైంగికదాడి..చివరికి

September 14, 2022

టాలీవుడ్‌కు చెందిన ఓ నటిని, ముంబైకి చెందిన ఓ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చి, పలుమార్లు లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత పెళ్లి చేసుకొమని నిలదీయగా ఆమెపై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి బెదిరింపులు రోజు రోజుకు పెరిగిపోవడంతో నటి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టాలీవుడ్‌కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్‌ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దాంతో ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత పెండ్లి ఎప్పుడు చేసుకుంటావని ఆమె అడగటంతో, వేధింపులు మొదలు పెట్టాడు. కొన్ని ప్రైవేటు ఫొటోలు అతని వద్ద ఉన్నాయని, వాటిని బయటపెడతానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై భౌతికదాడి కూడా చేశాడు” అని ఆమె కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని వివరాలను వెల్లడించారు.

అయితే, ఆ ఫిర్యాదులో బాధితురాలు..”నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆదిత్య కపూర్ పలుమార్లు లైంగికదాడి చేశాడు. తాజాగా పెళ్లి చేసుకుందామని అడిగాను. దాంతో అతడు నిరాకరించడమే కాకుండా నన్ను నానా మాటలతో దూషించి, తీవ్రంగా కొట్టాడు. నా ప్రైవేట్‌ ఫొటోలు అతని వద్ద ఉన్నాయని, వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడు.” అని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింది కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు 2016 నుంచి తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్నది.