జబర్దస్త్ నటిపై లైంగిక వేధింపులు..అర్ధరాత్రి స్కూటీ ఆపి - MicTv.in - Telugu News
mictv telugu

జబర్దస్త్ నటిపై లైంగిక వేధింపులు..అర్ధరాత్రి స్కూటీ ఆపి

May 25, 2020

jabardast

మహిళల కోసం కఠిన చట్టాలు తీసుకుని వచ్చినా వారిపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తనపై కూడా లైంగిక దాడి జరిగిందని జబర్దస్త్ నటి ప్రియాంక (సాయి తేజ) వెల్లడించింది. జబర్దస్త్ షోలో ఆడ వేషాలు వేస్తూ బాగా ఫేమస్ అయిన సాయి తేజ.. సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా మారిపోయాడు.

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…మూడు రోజుల క్రితం తనతో కొందరు కుర్రాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని.. నడి రోడ్డుపై స్కూటీ ఆపేసి చాలా చెత్తగా బిహేవ్ చేసి రచ్చ రచ్చ చేశారని చెప్పింది. అర్ధరాత్రి వేళ తన స్కూటీపై వస్తుంటే వాళ్లు తనను చూసి చెత్త కామెంట్స్ చేశారని, చుడిదార్ వేసుకుని.. పూర్తిగా మొహం కప్పుకుని కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నా కూడా తనను వాళ్లు కామం కళ్ళతో చూస్తూ కామెంట్స్ చేశారని తెలిపింది. గతంలో కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని చెప్పి ప్రియాంక సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.