‘శ‌భాష్ మిథు’..తెరపైకి మిథాలీరాజ్ జీవితం - MicTv.in - Telugu News
mictv telugu

‘శ‌భాష్ మిథు’..తెరపైకి మిథాలీరాజ్ జీవితం

December 3, 2019

'Shabaash Mithu01

ప్ర‌స్తుతం దేశంలో బ‌యోపిక్‌ల హవా నడుస్తోంది. సినీ, క్రీడా, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల‌ జీవితాలను దర్శకనిర్మాతలు తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటికే ధోని, సచిన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెల్సిందే. 

తాజాగా భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ బయోపిక్ రూపొందుతుంది. ఆమె జీవితం ఆధారంగా వ‌యాకామ్ 18 సంస్థ సినిమా నిర్మిస్తోంది. మిథాలీ పాత్ర‌లో తాప్సీ పన్నుని తీసుకున్నారు. షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ‘శ‌భాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈరోజు మిథాలీ రాజ్ పుట్టినరోజుని పురస్కరించుకొని చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. తాప్సీ చివ‌రిగా ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమాలో నటించారు. ఇందులో 70 ఏళ్ళ వ‌య‌స్సున్న వృద్దురాలి పాత్రలో నటించారు. ఇది కూడా ఓ క్రీడాకారిణి బయోపిక్ కావడం విశేషం.