భారత మహిళా క్రికెట్కు విశేషమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘శభాష్ మిథు’. తాప్సీ టైటిల్ రోల్ పోషించిన ఈ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది.
ఈ ట్రైలర్లో మిథాలీ రాజ్.. ‘మెన్ ఇన్ బ్లూ తరహా మనకు కూడా ఓ టీమ్ ఉంటే బాగుంటుంది.. ఉమెన్ ఇన్ బ్లూ..’ అని తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది మిథాలీ రాజ్ లేడీ క్రికెటర్గా ఎదుర్కొన్న అవమానాలు.. వాటి నుంచి తనను తాను ఎలా తీర్చిదిద్దుకొని ఉమెన్స్ క్రికెట్లో వరల్డ్ కప్ సాధించడం వంటివి ఎంతో భావోద్వేగంగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ. ఇక మిథాలీ రాజ్ పాత్రలో తాప్సీ పన్ను ఆ పాత్రలో ఒదిగిపోయింది. మిథాలీగా తాప్సీ అదరగొట్టింది. వయాకామ్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.