షారుఖ్ నొసటిపై బొట్టు.. రచ్చరచ్చ..  - MicTv.in - Telugu News
mictv telugu

షారుఖ్ నొసటిపై బొట్టు.. రచ్చరచ్చ.. 

October 29, 2019

దీపావళి పండుగ సందర్భంగా నటుడు షారూఖ్‌ ఖాన్‌ ట్విటర్‌‌లో పోస్ట్ చేసిన ఫోటో వివాదానికి దారి తీసింది. షారూఖ్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌, కొడుకు అబ్ రామ్‌‌తో కలిసి నుదుటన తిలకం ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ముస్లిం మతస్తుడివి అయుండి ఒక ఫోటో కోసం ఇలా నుదుటన తిలకం పెట్టుకుంటావా’ అంటూ కొంతమంది నెటిజన్లు షారూఖ్‌ను విమర్శిస్తున్నారు.

షారూఖ్‌పై వస్తున్న విమర్శలపై ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా  అజ్మి స్పందించారు. కేవలం తిలకం పెట్టుకున్నంత మాత్రాన షారూఖ్‌ను నిందించడం దారుణమన్నారు. ‘ప్రతీ దానికి ఒక హద్దు ఉంటుంది. భారతీయతలో అందమైన సంప్రదాయమైన తిలకం పెట్టుకున్నంత మాత్రాన ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇస్లాం మరీ అంత బలహీనమైనది కాదు. గంగా జమునా సంగమంలోనే భారత నిజమైన అందం దాగుంది’ అని విమర్శకులకు చురకలు అంటించారు. షారుఖ్‌కి బాసటగా నిలిచినందుకు షబానాను కూడా వ్యతిరేకిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా షారుఖ్ ఖాన్‌కు ఇలాంటి విమర్శలు ఎదురైన దాఖలాలున్నాయి.