Home > Featured > క్షణాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడిన డాక్టర్: వీడియో వైరల్

క్షణాల్లో వ్యక్తి ప్రాణాలు కాపాడిన డాక్టర్: వీడియో వైరల్

మహారాష్ట్రలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సాధారణ వైద్య పరీక్షల కోసం తన వద్దకు వచ్చిన ఓ రోగి ప్రాణాలను క్షణంలో కాపాడిన డాక్టర్ అర్జున్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. వీడియోను వీక్షిస్తున్న వారంతా 'శభాష్ డాక్టర్..ఆ వ్యక్తికి మరో పునర్: జన్మనిచ్చిన దేవుడు మీరు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన డాక్టర్ అర్జున్ అద్నాయక్ కార్డియాలజీ నిపుణుడు. తాజాగా గుండె సంబంధిత వ్యాధి ఉన్న ఓ రోగి..డాక్టర్ అర్జున్ వద్దకు జనరల్ చెకప్ కోసం వచ్చాడు. అయితే, రెండ్రోజుల క్రితమే అతనికి డాక్టర్ అర్జున్.. రొటీన్ చెకప్ చేశాడు. మళ్లీ మరోసారి ఆసుపత్రికి రమ్మన్నాడు. అందుకు కారణం..12 ఏళ్ల క్రితం అమర్చిన పేస్ మేకర్‌ను ఈసారి భర్తీ చేయించుకోవాలనుకున్నారు.

అయితే, క్యాబిన్‌లో వైద్యుడి ముందు సీట్లో కూర్చున్న ఆ రోగికి… ఉన్నట్టుండి అప్పుడే గుండెపోటు వచ్చింది. ఎలాంటి చలనం లేకుండా కుర్చీలో కిందికి వాలిపోసాగాడు. పరిస్థితిని గమనించిన డాక్టర్ అర్జున్.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, వెంటనే లేచి వచ్చి కుర్చీలో ఉన్న అతడికి అక్కడే సీపీఆర్ చేశాడు. దాంతో కొద్ది సెకన్లలో ఆ రోగి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. క్షణం ఆలస్యం చేయకుండా వైద్యుడు వెంటనే స్పందించిన తీరు, సీపీఆర్ చేసి రోగిని అపాయం నుంచి బయటపడేసిన వైనం అందరినీ కట్టిపడేసింది.

Updated : 7 Sep 2022 1:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top