శభాష్ ఉక్రెయిన్ రైతు.. వీడియో వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్ ఉక్రెయిన్ రైతు.. వీడియో వైరల్

March 1, 2022

bgfb

ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ‘యుద్ధం వద్దు – శాంతే ముద్దు’ అంటూ ప్రపంచ దేశాలు రష్యాను కోరుతున్నాయి. అయిన అవేవి పట్టించుకోకుండా రష్యా గత ఆరు రోజులుగా ఉక్రెయిన్ దేశంపై యుద్దాన్నీ తీవ్రతరం చేస్తోంది. దీంతో రష్యాపై ఆగ్రహించిన పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ దేశానికి చెందిన ఓ రైతు తన దేశం కోసం చేసిన సాహసం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఓ వైపు భయాంకర యుద్ధం, మరోవైపు ప్రాణ నష్టం జరుగుతున్న నేపథ్యంలో రష్యా దేశానికి చెందిన యుద్ధ ట్యాంకులనే ఎత్తుకెళ్లాడు ఆ రైతు. గుట్టుచప్పుడు కాకుండా అక్కడకు చేరుకున్న ఆ కర్షకుడు.. తన ట్రాక్టర్‌కు ఆ యుద్ధ ట్యాంకర్‌ను అనుసంధానం చేసుకొని, అక్కడి నుంచి తరలించాడు. దానిని గమనించిన ఓ రష్యా సైనికుడు ఆ వాహనాల వెనుక పరుగెత్తాడు. ఆ వీడియోను బ్రిటిష్ కన్జర్వేటివ్ నేత, ప్లైమౌత్ మూర్ వ్యూ అనే పార్లమెంట్ సభ్యుడు ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ వీడియోను వీక్షించిన ప్రతి ఒక్కరూ ”శభాష్ రైతు.. నీ సాహసం ఉక్రెయిన్ దేశానికి ఆదర్శం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.