శభాష్ లావణ్యా.. మగాళ్లు మాత్రమే చేస్తున్న పనిలోకి.. - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్ లావణ్యా.. మగాళ్లు మాత్రమే చేస్తున్న పనిలోకి..

March 5, 2022

24

సమాజంలో మహిళలు ఇప్పుడిప్పుడే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని, అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. కొన్ని పనులు కేవలం పురుషులు మాత్రమే చేయాలి. స్త్రీలు చేయకూడదనే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. పురుషులు చేయాల్సిన పనులను మహిళలు చేస్తే అసభ్యంగా ఉంటుంది అనే ఊహా కొంతమంది మహిళలలో ఇప్పటికీ ఉంది. దాంతో కొన్ని వ‌ృత్తులకు మహిళలు దూరంగా ఉంటున్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఓ మహిళ తరతరాలుగా వస్తున్న తమ సంప్రదాయ వృత్తిని గౌరవించి, అందరిచేత శభాష్ అనిపించుకుంటుంది.

ఆమె ఎవరు? ఏ ప్రాంతం? ఏ వృత్తి చేస్తుంది? అనే విషయాల్లోకి వెళ్తే.. ‘ఆకాశంలో సగం – అవకాశంలో సగం’ అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ నగర్‌లో నివసించే కొత్వాల లావణ్య అనే మహిళ మగవారి హెయిర్ సెలూన్ నడుపుతుంది. తన భర్త శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సెలూన్ షాపులో గత 4 నెలలుగా పనిచేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో ఈ పని నేర్చుకున్న ఆమె.. కుంటుంబ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ వృత్తిని నేర్చుకోక తప్పలేదని చెబుతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”ప్రస్తుతం అన్ని రకాల కట్టింగ్, షేవింగ్, హెడ్ మసాజ్‌లు చేస్తున్నా. సెలూన్ షాప్‌లోకి వచ్చే కస్టమర్లు సైతం నాకు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పని మొదలుపెట్టే ముందు ఎంతోమంది సూటి పోటి మాటలను విని తట్టుకున్నా. మగవారికి కట్టింగ్ చేయడం అనేది కేవలం మగవారు మాత్రమే చేయాలి అని, ఆలాటింది నువ్వు ఎలా చేస్తావు అని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటలను పట్టించుకోకుండ నేను నమ్మిన సిద్దాంతంతోనే ముందు అడుగు వేస్తున్నా” అని లావణ్య అన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మంత్రి హరీష్ రావుకి లక్ష మెజార్టీ రావాలని నెల రోజుల పాటు ఉచితంగా హెయిర్ కటింగ్ సెలూన్ నిర్వహించారు.