శభాష్ రిథమ్.. కేవలం 10 ఏళ్ల వయసులోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్ రిథమ్.. కేవలం 10 ఏళ్ల వయసులోనే..

May 23, 2022

ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. కేవలం 10 ఏండ్ల వయసులోనే ఈ ఘనత సాధించటం పట్ల రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు, సినిమా హీరోలు అభినందిస్తున్నారు. అతిచిన్న వయసులోనే పిన్న వయస్కురాలిగా రిథమ్ మమానియా రికార్డు సృష్టించింది.

రిథమ్ మమానియా మాట్లాడుతూ… ” నేను సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతున్నాను. తొలిసారిగా కాలినడకన దూద్‌ సాగర్‌ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. ఆ తర్వాత సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. ఈ ట్రెక్కింగ్‌ పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమే నాకు నేర్పింది” అని ఆమె అన్నారు.

మరోపక్క రిథమ్‌ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది. 11 రోజుల పాటు ఆమె యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని రిథమ్ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. ఇక రిథమ్‌ బేస్‌క్యాంప్‌కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే, ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబడి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది.