పెళ్లికి సర్కారు చదివింపు ఇక రూ. 1,00,116 - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికి సర్కారు చదివింపు ఇక రూ. 1,00,116

March 19, 2018

తెలంగాణ ప్రభుత్వం.. బడ్జెట్‌లో చెప్పినట్లే పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయాన్ని పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఇస్తున్న మొత్తాన్ని రూ. 1,00,116 కు పెంచినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం కింద తొలుత రూ. 51 వేలుగా నిర్ణయించిన ప్రభుత్వం తర్వాత రూ. 75 వేలకు పెంచింది.ఈ పథకాల కింద ఇప్పటివరకు 3.65 లక్షల మందికి లబ్ది కలిగిందని కేసీఆర్ వెల్లడించారు. పేదరికం చాలా సమస్యలను సృష్టిస్తోందని,పెళ్లి ఖర్చుకు భయపడి కొందు ఆడపిల్లలను వదిలించుకోవడానికి  భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి ఖర్చులకు డబ్బు లేక కొందరు అవివాహితలుగా మిగులుతున్నారని అన్నారు. ‘పరిపాలనలో మానవీయ విలువలు ఉండాలని నిరుపేద ఆడపిల్లల కోసం ఈ పథకం తెచ్చాం.. ఇది జనం మెచ్చిన పథకం.. నాకెంతో ఇష్టమైన పథకం.. ’ అని ఆయన చెప్పారు.