షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బేడీలు. చరిత్రలో తొలిసారి..  - MicTv.in - Telugu News
mictv telugu

షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బేడీలు. చరిత్రలో తొలిసారి.. 

November 30, 2019

Shadnagar ..

ప్రియాంక హత్యోదంతంపై ఆగ్రహించిన జనం  షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బేడీలు వేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ఓ పోలీస్ స్టేషన్‌కు తాళం పడింది.. ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు స్టేషన్‌కు తాళాలు అందుబాటులో లేక బేడీలు వేసి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరస్తులకు వేయాల్సిన సంకెళ్లు పోలీస్ స్టేషన్‌కు పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.   నిందితులు ఉన్న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు ఆందోళనకారులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులు ఎంత చెప్పినా నిరసనకారులు పట్టించుకోవడం లేదు. 

ఈ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్వచ్చందంగా రోడ్లపైకి వస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలో యువత కదం తొక్కింది. పార్లమెంట్ స్ట్రీట్‌లో భారీగా చేరుకొని ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా చట్టాలను మరింత పటిష్టం చేయాలని కోరారు. ఈ ఆందోళనలతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ప్రియాంక కుటుంబాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శిస్తున్నారు.