ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ చిరకాల స్నేహితులు. బాలీవుడ్లో దశాబ్దాలుగా వారి స్నేహం కొనసాగతుంది. వృత్తి పరంగా ఇద్దరు భాక్సాఫీస్ వద్ద పోటీపడినా ..బయట మాత్రం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. మరోసారి ఇదే రుజువైంది. సల్మాన్ ఖాన్ 57వ జన్మదిన వేడుకలకు షారూక్ ఖాన్ హాజరయ్యారు. స్వయంగా ఉంచి తన మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. పార్టీలో వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు..షారూఖ్‌ను, సల్మాన్ ఆప్యాయంగా కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరి ఖాన్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
సోమవారం అర్థరాత్రి సల్మాన్ పుట్టిన రోజు వేడుకలను అతడి సోదరి అర్పితా ఖాన్ ఘనంగా ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖ నటీనటులు హాజరయ్యి సందడి చేశారు. పూజా హెగ్డే, కార్తీక్ ఆర్యన్, సునీల్ శెట్టి, టబు, సంగీతా బిజ్లానీ వంటి వారు తరలివచ్చారు. అయితే పార్టీలో షారూక్ ఖాన్ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. షారూక్, సల్మాన్ లు ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోయారు. షారూక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో షారూక్ ఖాన్ అతిథి పాత్రలో నటించగా.. సల్మాన్ చిత్రం టైగర్ 3లో షారూఖ్ కూడా అతిథి పాత్రలో నటిస్తారని సమాచారం.