కుబేర హీరోలు వీరే… - MicTv.in - Telugu News
mictv telugu

కుబేర హీరోలు వీరే…

August 23, 2017

ప్రపంచంలో ఎక్కువగా ఆర్జిస్తున్న నటుల జాబితాను ఫోర్భ్స్  ప్రకటిచింది. సినిమా నటులలో ఎక్కువగా సంపాదిస్తూ మెుదటి స్థానంలో నిలిచారు హాలీవుడ్ నటుడు వార్క్ వాల్ బేర్గ్. భారత్ కు చెందిన ముగ్గురు హీరోలు వరుసగా 8, 9, 10 స్థానాల్లో నిలిచారు. షారూఖ్ ఖాన్ 38 మిలియన్ల డాలర్లు  (రూ. 243.50 కోట్ల) తో  8వ స్థానంలో ఉండగా, సల్మాన్ ఖాన్ 37 మిలియన్ల డాలర్లు  (రూ. 237 కోట్ల) తో 9వ స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ 35. 5 మిలియన్ల డాలర్లు (227.5 కోట్ల) తో10వ స్థానంలో నిలిచారు.

అమీర్ ఖాన్ మూవీ ‘దంగల్’ చైనాలో 2 వేల కోట్లు (312 డాలర్లు) ఆర్జించినా  కూడా అమీర్ ఖాన్ పేరు లేకపోవడం గమనార్హం. ‘ట్రాన్స్ పార్మర్’ హీరో వార్క్ వాల్ బెర్గ్ 68 మిలియన్ డాలర్ల సంపాదనతో అత్యధికంగా ఆర్జిస్తున్న నటుల జాబితాలో మెుదటిస్థానంలో నిలిచాడు.