నాలుగేళ్ల గ్యాప్ తరువాత షారూఖ్ ఖాన్ చేసిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కుల మత ప్రాంత బేధం లేకుండా దేశంలోని అన్ని వర్గాలని ఆకర్షిస్తున్న పఠాన్ అంతర్జాతీయ బాక్సాఫీసులను కూడా షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొట్టమొదటి హిందీ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది పఠాన్. ఇండియాలో అత్యధిక తొలిరోజు ఓపెనింగ్స్ వచ్చిన రికార్డు KGF 2 (హిందీ) సినిమా పేరిట ఉంది. ఈ చిత్రానికి సుమారుగా బాక్సాఫీస్ వద్ద 55 కోట్ల ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే పఠాన్ ఈ రికార్డుని తుడిచిపెట్టేసింది. ఈ సందర్భంగా షారుక్ తన మన్నత్ లో సన్నిహితుల కోసం గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో పఠాన్ టాక్ విన్న షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కన్నీళ్లు పెట్టుకుందట. సర్వత్రా వస్తున్న యునానిమస్ టాక్ అందరి నోట్లో నుండి వింటూ గౌరీ ఖాన్ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయట.
బాలీవుడ్ కథనాల ప్రకారం.. ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న భర్త చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా నాలుగేళ్లు ఇంట్లో కూర్చుంటే.. ఆ పరిస్థితుల నుంచి అతణ్ని కాపాడుకునే బాధ్యతంతా గౌరీ తన భుజాలపై వేసుకుంది. భర్తకి భార్య ఎంత సపోర్టు ఇస్తే దైర్యంగా ఉంటారో అలాంటి మనోధైర్యాన్ని ఎల్లప్పుడూ గౌరీ నుండి ఉండేది. ఇంతలోనే షారుఖ్ కొడుకుపై కేసులు, రాజకీయ కక్ష ఇలాంటి వాటినన్నింటిని షారుక్ ఎదుర్కొని విమర్శించిన వాళ్ళందరి గూబ పగలకొట్టేలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. పఠాన్ గురించి అన్ని వర్గాల నుంచి వినబడుతున్న టాక్ విని గౌరీ ఖాన్ హృదయం ఉప్పొంగిపోయింది. సినిమానే శ్వాసగా 30ఏళ్ళ నుండి బ్రతుకుతున్న షారుఖ్ ఖాన్ రీఎంట్రీ చిత్రం కోసం ఎంత కష్టపడ్డాడో తనకు బాగా తెలుసు గనుక.. ఈ విషయాలు వింటున్నప్పుడు గౌరీ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుందని ఆ పార్టీలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Pathaan Movie Collections : పఠాన్ దెబ్బకు కేజీఎఫ్-2 రికార్డు బద్దలు
పవన్ కళ్యాణ్ ఎదుటే.. రామ్ చరణ్ కి చుక్కలు..!
నీ మూడు పెళ్లిళ్ల గోల ఏంటీ బయ్యా.. బాలయ్య ప్రశ్నకి పవన్ షాక్..!