Shah Rukh Khan wishes PM Modi on his birthday
mictv telugu

ప్రధాని మోదీని సెలవు తీసుకోమన్న షారూఖ్ ఖాన్.. ఎందుకంటే

September 17, 2022

Shah Rukh Khan wishes PM Modi on his birthday

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజకీయవేత్తలతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన వారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే వీరందరిలోకెల్లా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ విష్ చేసిన విధానం వెరైటీగా ఉంది.

ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ షేర్ చేస్తూ ‘దేశం కోసం, దేశ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీరు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయం. పైవాటి కోసం ఇంకా కృషి చేయాలంటే మీకు కొంత బలం, మంచి ఆరోగ్యం అవసరం. కాబట్టి ఈ ఒక్కరోజైనా సెలకు తీసుకొని ఆనందించండి సార్ అండ్ పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని చెప్పడంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అయింది. కాగా, ప్రధాని నరేంద్రమోదీ గత 13 ఏళ్లుగా గుజరాత్ సీఎం, భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. ఇది ఓ రికార్డుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత పఠాన్ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్న షారూఖ్.. ఆ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడైన అట్లతో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. నయనతార కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్‌లో తాజాగా విడుదలై సూపర్ హిట్ అయిన బ్రహ్మస్త్ర సినిమాలో షారూఖ్ ఒక చిన్న కామియో పాత్ర చేశారు.