పఠాన్ మూవీ కలెక్షన్ల తుఫాన్ ఆగడం లేదు. వివాదాల నడుమ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 18 రోజులు అవుతున్నా పఠాన్ హవా కొసాగుతుంది. వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. షారూఖ్ దెబ్బకు రికార్డులు బద్దలవుతున్నాయి. బాద్‌షా నట విశ్వరూపం, జాన్ అబ్రహం విలనిజం, దీపికా పదుకుణే అందమైన పెరఫామెన్స్‌లు ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 18 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 475 కోట్లు వరకూ నెట్ వసూలు చేసింది. అలాగే, రూ. 925 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ వచ్చింది. విదేశాల్లో కూడా పఠాన్ చిత్రానికి భారీ కలెక్షన్స్ పోటెత్తుతున్నాయి. ఓవర్సీస్‌లో 42 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టి సత్తా చాటుకుంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది రూ. 350 కోట్లు వసూలు చేసింది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది.
స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ దీనికి మ్యూజిక్‌ను అందించాడు. విడుదలకు ముందు పఠాన్ చిత్రాన్ని చుట్టుముట్టిన వివాదాలు కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.