ఏడుస్తూ షారూక్ తో సెల్ఫీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఏడుస్తూ షారూక్ తో సెల్ఫీ..!

July 5, 2017

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీ కామన్. ప్రముఖులు కనిపిస్తే వాళ్లతో హ్యాపీ హ్యాపీగా సెల్ఫీ తీసుకుంటాం. ఓ అభిమాని ఏడుస్తూ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ తో సెల్ఫీ దిగాడు. ‘జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ సినిమా ప్రమోషన్ లో భాగంగా షారుక్‌, అనుష్క శర్మ ముంబయిలో సందడి చేశారు. అక్కడే ఉన్న ఓ అభిమాని షారుక్‌ని చూసి సెల్ఫీ కావాలని ఏడుస్తూ నిలపడ్డాడు. అతన్ని గమనించిన షారుక్‌ దగ్గరికి పిలిచి సెల్ఫీ దిగాడు. దీంతో ఆ అభిమాని మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. సెల్ఫీ దిగుతున్నప్పుడు అతను ఏడుస్తున్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

https://youtu.be/D1YsTyhK6ro