shahrukh khan watch price
mictv telugu

షారుఖ్ బ్లూ సిరామిక్ వాచ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైంది..!

January 19, 2023

సినిమాలతో సంబంధం లేకుండా నిత్యం సోషల్ మీడియాలో పాపులర్ గా ఉంటాడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయితే ఈ మధ్య తన తాజా చిత్రం ‘పఠాన్’ కారణంగా షారుఖ్ క్రేజ్ రెట్టింపు అయింది. షారుఖ్ ఖాన్ సాంగ్స్, ట్రైలర్స్, డ్రెస్సింగ్ అన్ని కూడా తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. రాజకీయ నాయకులు ఎప్పటిలానే షారుఖ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో మరింత పెంచేశారు. కట్ చేస్తే తాజాగా ప్రధాని మోడీ రంగంలోకి దిగి షారుఖ్ ఖాన్ ని విమర్శించొద్దంటూ బీజేపీ నాయకులని సున్నితంగా హెచ్చరించాడు కూడా. దాంతో షారుఖ్ పై నెగిటీవ్ ప్రచారం తగ్గింపోయింది. పఠాన్ ని బ్యాన్ చేయాలన్న వంటి విమర్శలు పడిపోయి.. కొత్త వార్తలు వస్తున్నాయి. వీటిలో రెండు రోజుల నుండి వైరల్ అవుతున్న వార్త షారుఖ్ ధరించే వాచ్ గురించే. SRK వాచ్ ధర సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాచ్ ని షారుఖ్ వాడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. షారుఖ్ కి వాచీల పిచ్చి అని అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పఠాన్ తాజాగా వరల్డ్ కాస్లీ వాచ్ ధరించినట్టు బీ టౌన్ లో వార్తలొస్తున్నాయి. షారుఖ్ తరచుగా వివిధ సందర్భాలలో ఆడెమర్స్ పిగ్యెట్ వాచ్ ధరించి కనిపిస్తూ వస్తున్నాడు. బ్లూ సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్ని ధరించి ఉన్న తాజా చిత్రాన్ని మంగళవారం షారుక్ ఖాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ ఫోటోలో షారుఖ్ ధరించిన వాచ్ 4.75 కోట్ల రూపాయలు అని ఒక ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ఈ వాచ్ సంవత్సరం ఆగస్టులో విడుదలైంది. ఇక లగ్జరీ వాచెస్ USA అనే వెబ్సైట్ ప్రకారం ప్రత్యేకమైన లగ్జరీ వాచ్ వాస్తవానికి దాదాపు రూ. 4.9 కోట్లు ($600000)గా ఉంది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచెస్లో ఒకటిగా పరిగణించబడుతుంది.