కరీంనగర్ వీధుల్లో షకలక శంకర్ భిక్షాటన  - MicTv.in - Telugu News
mictv telugu

కరీంనగర్ వీధుల్లో షకలక శంకర్ భిక్షాటన 

September 17, 2020

Shakalaka Shankar begging in the streets of Karimnagar

బిచ్చగాడు సినిమాలో హీరో తన తల్లి ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తాడు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్, ఈమధ్య విడుదలైన ‘పరాన్నజీవి’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన షకలక శంకర్ బిచ్చగాడిగా మారాడు. ప్రస్తుతం కరీంనగర్ వీధులలో బిక్షాటన చేస్తున్నాడు. ఇల్లిల్లూ తిరుగుతూ బిచ్చం అడుగుతున్నాడు. అతన్ని చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అతనికి ఏం కష్టం వచ్చిందని జనాలు ఆరా తీశారు. తనకు ఏ కష్టం రాలేదు కానీ, ఇతరుల కష్టాన్ని తీర్చడానికి శంకర్ ఇలా బిచ్చగాడిగా మారాల్సి వచ్చింది. 

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో చితికిపోయిన 7 కుటుంబాలను ఆదుకోవడానికి షకలక శంకర్ ఇలా భిక్షాటన చేస్తున్నాడు. శంకర్ వెంట ఆయన అభిమానులు కూడా నడిచారు. ఈ బిక్షాటనలో రూ.90 వేల వరకు సమకూరాయని.. దానికి మరో పది వేలు కలిపి లక్ష రూపాయలతో కుటుంబాలకు సహాయం చేస్తానని శంకర్ వెల్లడించాడు. కాగా, నిరుపేదలకు సహాయం చేసేందుకు బిచ్చగాడిగా మారిన షకలక శంకర్‌పై కరీంనగర్ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.