Home > Featured > లెక్కల టీచరమ్మగా విద్యాబాలన్.. ఫస్ట్‌లుక్‌ ఇలా..  

లెక్కల టీచరమ్మగా విద్యాబాలన్.. ఫస్ట్‌లుక్‌ ఇలా..  

Shakuntala Devi..

విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటి విద్యాబాలన్. చిన్నా చితక పాత్రలతో హిందీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు జాతీయ ఉత్తమ నటిగా ఎదిగింది. ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో విద్య ఎక్కడికో వెళ్ళిపోయింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘శకుంతలాదేవి.. హ్యూమన్‌ కంప్యూటర్‌’. ప్రముఖ గణితశాస్త్ర నిపుణురాలు, 'హూమ్యన్‌ కంప్యూటర్‌'గా పేరుగాంచిన శకుంతలా దేవి జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అనుమీనన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌‌లుక్‌ పోస్టర్‌ను సోషల్‌మీడియాలో చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో విద్యాబాలన్‌ ఒకటో నంబర్‌పై నిలబడింది. కంప్యూటర్‌ రెండు, క్యాలికులేటర్‌ మూడో నంబర్లపై ఉన్నట్లు చూపించారు. అంతేకాకుండా ఓ ప్రత్యేక వీడియోను కూడా చిత్రబృందం విడుదల చేసింది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తన కెరియర్‌లో చాలా ప్రత్యేకమైంది అని అంటోంది విద్య. చూడాలి మరి విద్యకు ఈ సినిమా మరింత ఇమేజ్ తెచ్చి పెడుతుందో లేదో. కాగా, విద్య తెలుగులో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

Updated : 16 Sep 2019 12:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top