గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో సమంత మన ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన దీని ట్రైలర్ మంచి టాక్ ను సంపాదించుకుంది. ఇప్పడు కొత్తగా రిలీజ్ చేసిన సమంత పిక్ మళ్ళీ వైరల్ అవుతోంది. ఇందులో సమంత స్టన్నింగ్ లుక్ లో అదిరిపోయింది. సమంత అప్పీరియన్స్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.
శాకుంతలం సినిమాకు గుణశేఖర్ చాలా కష్టపడ్డారని టాక్. ప్రతీ ఫ్రేమ్ సహజంగా కనిపించాలని తాపత్రయం పడ్డారట. దానికోసం చాలా ఖర్చు పెట్టారని అంటున్నారు. సమంత లుక్ నేచురల్ కనిపించడం కోసం ఒరిజల్ నగలనే వాడారుట. దీని కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. సమంతకు స్టైలిస్ట్ గా బాలీవుడ్ డిజైనర్ నీతా లుల్లా చేశారు.
శాకుంతలం సినిమాలో ఉపయోగించిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. నగలతో పాటూ సమంత కట్టుకున్న చీరలనూ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. ముత్యాలను పొదిగిన 30 కిలోల బరువుండే చీరను సమంత కోసం ప్రత్యేకంగా తయారు చేయించారు. సమంత ఏడు రోజుల పాటూ ఈ చీరను కట్టుకుని షూటింగ్ చేసింది.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తీసారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న శాకుంతలం మూవీ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
దోబూచులాట అయిపోయింది-కూతురుని చూపించిన ప్రియాంక
తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి భావోద్వేగ ట్వీట్