దేవదాసులా మందేస్తున్న‘అర్జున్ రెడ్డి’ భామ - MicTv.in - Telugu News
mictv telugu

దేవదాసులా మందేస్తున్న‘అర్జున్ రెడ్డి’ భామ

May 16, 2020

mahanati

చిత్రసీమలోని విచిత్రం అదే. ఎంత పెద్ద హిట్ సినిమాలో నటించినా కొందరి కెరీర్ తీసికట్టుగానే మిగిలిపోతుంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండతో జట్టుకట్టిన కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన హీరోయిన్ షాలినీ పాండే పరిస్థితి అలాగే తయారైంది. ఆ చిత్రం తర్వాత ఆమెకు చెప్పుకోదగ్గ చిత్రమేదీ లేదు. పైగా లాక్‌డౌన్ కూడా తోడు కావడంతో ఆమె గోవాలోని తనింట్లో సరదాగా గడుపుతోంది. 

బాత్ టబ్బులో కూర్చుని మద్యం తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఆమే స్వయంగా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మహానటి’, ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’  చిత్రాల్లో నటించిన షాలినికి కోలీవుడ్‌లో కాస్త నెట్టుకొస్తోంది.