అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజే భారత వైమానిక దళం చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని క్షిపణి స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా గ్రూప్ కెప్టెన్ షాలిజా ధామిని నియమించింది. 2,800 గంటలకు పైగా విమానాన్ని నడిపిన అనుభవం ఉన్న అత్యంత క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ అయిన ధామి, ఇప్పుడు భారతదేశం యొక్క అత్యంత సున్నితమైన సరిహద్దు సెక్టార్‌లలో కమాండ్ కంట్రోల్‌ను పర్యవేక్షించనున్నారు. మహిళలు యుద్ధభూమిలో విధులు నిర్వహించడం ఇదే మొదటిసారి.
షాలిజా ధామి 2003లో హెలికాప్టర్ పైలట్‌గా వాయుసేనలోకి అడుగుపెట్టారు. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ గా పేరుతెచ్చకున్నారు . ఆమె వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్‌గా పనిచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధామికి బాధ్యతలు అప్పగించి పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలను కల్పిస్తున్నామని అధికారులు ఈ నిర్ణయంతో స్పష్టం చేశారు. ధామి వైమానిక దళం మొదటి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ తో పాటు వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ కమాండర్ అని అధికారులు తెలిపారు.
యుద్ధ భూమిలో , కమాండ్ నియామకాలలో మహిళా అధికారులను నియమించడం అనేది ఓ మైలురాయని, లేడీ ఆఫీసర్ నాయకత్వం వహించే ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు సాయుధ బలగాలకు కీలకమైన కార్యాచరణ ఆస్తిగా ఉంటాయని సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ అనిల్ చోప్రా అన్నారు.
IAF,నౌకాదళం కూడా మహిళా అధికారులను తమ ప్రత్యేక దళాల యూనిట్లలో చేరడానికి అనుమతించాయి. ఫిబ్రవరిలో, సైన్యం మెడికల్ స్ట్రీమ్ దాటి మొదటిసారిగా మహిళా అధికారులను కమాండ్ పాత్రలకు నియమించడం ప్రారంభించింది. వారిలో దాదాపు 50 మంది ఉత్తర , తూర్పు కమాండ్‌ల క్రింద ఫార్వర్డ్ లొకేషన్‌లతో సహా కార్యాచరణ ప్రాంతాలలో హెడ్ యూనిట్‌లుగా మహిళలు ఉన్నారు. చైనాతో భారతదేశ సరిహద్దులను కాపాడే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అదే విధంగా జనవరిలో సైన్యం మొదటిసారిగా సియాచిన్ హిమానీనదంపై కెప్టెన్ శివ చౌహాన్‌ను ఆఫీసర్ గా నియమించింది. ఇదే క్రమంలో ఇప్పుడు యుద్ధభూమిలోనూ మహిళలకు అవకాశం ఇచ్చారు.