దేశ రాజకీయాల్లోకి వెళ్దామా?, దేశాన్ని మారుద్దామా?, బంగారు భారతదేశం కోసం కోట్లాడుదామా? అంటూ కేసీఆర్ నారాయణ ఖేడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ ఖేడ్ చేరుకున్న ఆయన.. సంగమేశ్వరు, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్ధాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగా సభలో మాట్లాడారు.