పాక్ క్రికెటర్‌ హసన్‌ అలీపై నెటిజన్ల ఫైర్.. - MicTv.in - Telugu News
mictv telugu

పాక్ క్రికెటర్‌ హసన్‌ అలీపై నెటిజన్ల ఫైర్..

December 10, 2019

Pakistan 02

పాకిస్తాన్‌ క్రికెటర్‌ హసన్‌ అలీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘గాయం క్రికెట్‌కు దూరమయ్యావు సరే.. మరి మోడలింగ్‌ ఎందుకు చేస్తున్నావు. సిగ్గుందా నీకు… మోడలింగ్‌కు గాయం అడ్డురావడం లేదా. నిన్ను మళ్లీ జట్టులోకి తీసుకోకూడదు’ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గాయం కారణంతో పాక్‌ జట్టులో స్థానం కోల్పోయిన హసన్‌.. ర్యాంప్‌ వాక్‌ చేయడమే వారి ఆగ్రహానికి కారణం. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాక్‌ క్రికెట్ జట్టు సిద్ధం అవుతోంది. డిసెంబరు 11 నుంచి తొలి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

కాగా, హసన్‌ అలీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న కారణంగా అలీని సెలెక్టర్లు పక్కన పెట్టారు. ప్రస్తుతం ఓ కార్యక్రమం సందర్భంగా హసన్‌ అలీ ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. ఉత్సాహంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో..‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే ర్యాంప్‌ వాక్‌ చేస్తూ బాగానే ఉన్నావే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.