అన్నతో రేప్ చేయించబోయాడు.. షమీపై ఆరోపణ.. - MicTv.in - Telugu News
mictv telugu

అన్నతో రేప్ చేయించబోయాడు.. షమీపై ఆరోపణ..

March 10, 2018

టీమిండియా క్రికెట్ జట్టు ఆటగాడు మహమ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ మరో సంచలన ఆరోపణ చేసింది. అతనికి ఎంతోమంది మహిళలతో అక్రమ సంబంధాలున్నాయని, తనను శారీరక, మానసిక హింసకు గురిచేశాడని చెప్పిన ఆమె.. షమీ వావివరసన మరిచి అతని అన్నతో తనపై అత్యాచారం చేయించబోయాడని మీడియాకు తెలిపింది.  

Image result for Mohammed Shami wife

షమీ అతని అన్న అయిన  హసీబ్‌తో శృంగారంలో పాల్గొనాలని నన్ను బలవంతం చేసేవాడు. నేను నిరాకరించేదాన్ని. అయితే ఒక రోజు షమీ నన్ను హసీబ్ గదిలోకి తోసి బయట గడియపెట్టాడు. హసీబ్ నన్ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేయబోయాడు. నేను ప్రతిఘటిస్తూ గట్టిగా అరిచి కేకలు వేశాను. దీంతో గది బయట ఉన్న షమీ కంగారుపడి, విషయం అందరికీ తెలుస్తుందనే భయంతో వెంటనే తలుపు తీశాడు..’ అని హసీన్ చెప్పింది.

షమీనే కాకుండా తనను కుటుంబ సభ్యులు కూడా తనను మాటల్లో చెప్పలేని హింసలకు గురి చేశాడని వెల్లడించింది. షమీ తనను బెదిరిస్తుండగా రికార్డు చేసిన ఆడియోలు అంటూ కొన్ని సంభాషణలను వీడియాకు అందించింది. తనకు చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు షమీ చెబుతున్నట్లు ఆ ఆడియోల్లో ఉంది. హసిన్ ఫిర్యాదుపై కోల్ కతా పోలీసులు ఇప్పటికే షమీపై హత్యాయత్నం, గృహసింహ తదితర కేసులు పెట్టారు.

కాగా షమీ అన్న హసీబ్‌పైనా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి. గోవధకు పాల్పడిన నిందితులు పారిపోవడానికి సహకరించాడన్న ఆరోపణలపై పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.