శామీర్‌పేటలో మృత్యుఘోష.. పల్టీ కొట్టి, మరో కారుపైకి ఎక్కి.. - MicTv.in - Telugu News
mictv telugu

శామీర్‌పేటలో మృత్యుఘోష.. పల్టీ కొట్టి, మరో కారుపైకి ఎక్కి..

August 12, 2019

Shamirpet cars.

రహదారి మళ్లీ ప్రాణాలను కబళించింది. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్ రహదారిపై వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢొట్టింది. తర్వాత అటువైపు వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. కారు నలుగురితో కరీంనగర్‌ ‌నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా శామీర్‌పేట ఎమ్మార్వో ఆఫీసు వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. వేగంగా  రావడంతో పల్టీలు కొడుతూ అటువైపు హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న మరో కారుపైన పడింది. హైదరాబాద్ వస్తున్న కారులోని ప్రయాణికుల్లో ఒక మహిళ సహా ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారు డ్రైవర్‌ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.