పోలీసులను చూసి భయపడి.. నిండు ప్రాణం బలి - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులను చూసి భయపడి.. నిండు ప్రాణం బలి

September 25, 2019

Shamshabad airport car accident 

శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో మంగళవారం అర్ధరాత్రి ఓ క్యాబ్‌ డ్రైవర్‌ బీభత్సం సృష్టించాడు. పోలీసులు చూసిన కంగారులో వేగంగా కారు నడిపి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు.  వివరాల్లోకి వెళితే… శంషాబాద్‌ విమానాశ్రయం దగ్గర క్యాబ్‌లో ప్రయాణికులను ఎక్కించుకుంటుండగా పోలీసులు రావడంతో భయపడిన డ్రైవర్‌ హడావిడిగా అక్కడి నుంచి కారును వేగంగా పోనిచ్చాడు. అయితే క్యాబ్‌ ఎక్కేందుకు ప్రయత్నించిన యాదయ్య అనే ప్రయాణికుడి చొక్కా కారు డోర్ లోపల ఇరుక్కోంది. 

ఇది గమనించని క్యాబ్ డ్రైవర్‌ ఎనిమిది కిలోమీటర్లపాటు కారును అలాగే పోనిచ్చాడు. యాదయ్యను కారు లాక్కెల్లడంతో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కారు బయట మృతదేహం వేలాడుతుండటాన్ని శంషాబాద్ టోల్‌గేట్ వద్ద వాహనదారులు గమనించారు. వారు భయంతో కేకేలు వేయడంతో క్యాబ్ వదిలి డ్రైవర్‌ అక్కడ నుంచి పారిపోయాడు. టోల్ గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే మృతుడి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.