Shane Warne and Andrew Symonds sudden demise after remarks about Marnus Labuschagne
mictv telugu

ఆ క్రికెటర్‌ను తిడితే చచ్చిపోతారు! వారిద్దరి మృతి వెనక..

May 17, 2022

Shane Warne and Andrew Symonds sudden demise after remarks about Marnus Labuschagne

ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ క్రికెటర్లు షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్… కేవలం రెండు నెలల గ్యాప్‌లోనే ప్రాణాలు కోల్పోవడం క్రికెట్ ప్రపంచాన్ని కలిచి వేస్తోంది. వార్న్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోగా, ఆండ్రూ సైమండ్స్ ఓ యాక్సిడెంట్‌లో కన్నుమూశారు. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఇద్దరూ గత ఏడాది ఓ వివాదంలో ఇరుక్కోవడమే అందుకు కారణం. 2021 లో టీమిండియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో కామెంటేటర్లు వ్యవహారించిన షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్… ఆసీస్ యంగ్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు..

లబూషేన్‌ 91 పరుగుల వద్ద ఔట్‌ కావడంతో తొలుత వార్న్‌ లబూషేన్‌ను విమర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సైమండ్స్‌ అందుకుని.. లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు (హాగ్‌ పైల్‌) ఇవ్వాలంటూ బూతు పురాణం మొదలుపెట్టాడు. దీన్ని వార్న్ కొనసాగించాడు. అయితే ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుందని తెలియక ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. అయితే టీవీల్లో రికార్డు కావడంతో తీవ్ర వివాదాస్పదమైంది. విచిత్రంగా లబుషేన్‌ను తిట్టిన వీరిద్దరూ… 2022లోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ యంగ్ బ్యాట్స్‌మెన్ పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. లబుషేన్‌ని ఎవ్వరూ ఏమనొద్దని, అంటే ఏం జరుగుతుందో చెప్పలేమంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.