ముసలమ్మ ముచ్చట - MicTv.in - Telugu News
mictv telugu

ముసలమ్మ ముచ్చట

June 28, 2017

ముసలమ్మ చేసిన పనికి ఏకంగా విమానం ఇంజనే ఇప్పాల్సి వచ్చింది…. ఏందో ముసలమ్మ కిందపడిందేమో…. ఇంజన్ల  చేతి కట్టే పడిందని అనుకునేరు. కమ్యూనిస్టు దేశం చైనాలో  ఓ ముసలమ్మ షాంఘై ఫుడోంగ్ అంతర్జాతీయ విమానశ్రాయానికి  ఆమె భర్తను, బిడ్డ అల్లుని తీసుకుని పోయింది. అక్కడి నుండి గంగ్జౌ పట్టణానికి వెళ్లేందుకు సిద్దంగా విమానం ఎక్కింది. ఎంత కమ్యూనిస్టు దేశం అయినా అక్కడ భయ భక్తులు, పాపభీతి ఉన్నవాళ్లు ఉంటారు కద. అసోంటోళ్ల సంఘానికి ఆమె పెద్ద దిక్కున్నట్లుంది.. అందుకే విమానానికి ఎలాంటి  ఇబ్బంది రాకుండా  ఉండేందుకు… ముందు జాగ్రత్తగా ఓ తొమ్మది నాణాలను విమానం ఇంజన్లో వేసింది.

ఇంకెం ఉంది. విషయం గమనించిన విమానం సిబ్బంది… టేకాఫ్ అయ్యేందుకు రెఢీగా ఉన్న విమానాన్ని ఆపేసి ఇంజనీ విప్పారు. కొన్ని కాయిన్లు దొర్కాయి…మొత్తం ఇంజిన్ విప్పిన తర్వాత అన్నీ కాయిన్లు దొర్కాయి. ఎందుకిట్ల  చేశావని అడిగితే అతీతశక్తులపై ఉన్న నమ్మకంతో ఇట్లా చేశానని చెప్పిందట. ఫ్లైట్లో అందర్నీ పంపి… ఆమెను అరెస్టు చేశారట పోలీసులు.