శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా RC15. దీని గురించి చాలా రకాల వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. అలాగే షూటింగ్ కూడా చాలా వేగంగా సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడూ బయటకు వస్తునే ఉన్నాయి. దీంతో ఆర్సీ 15 గురించి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఫోటోలు, వీడియోలు మాత్రమే లీక్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు సినిమా కథ కూడా కొంత బయటకు వచ్చింది.
సినిమాలో రామ్ చరణ్ రెండు రకాల పాత్రలు పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడుట. పార్టీ ఒకటి పెట్టడం, ఉద్యమం చేయడం లాంటి పార్ట్ లు షూటింగ్ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కు జోడీగా అంజలి నటిస్తోంది. ఇక మూవీలో మెయిన్ విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నాడు. అతని కొడుకుగా ఎస్. జె.సూర్య నటిస్తున్నాడు. మొత్తానికి ఇదొక పొలిటికల్ డ్రామాగా తీస్తున్నాడు శఠంకర్ అనే టాక్ నడుస్తోంది.
సినిమాలో చరణ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ టైమ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రతో చరణ్ కు చాలా పేరు వస్తుందని, పొలిటికల్ సీన్స్, స్పీచ్ లతో చరణ్ ఓ రేంజ్ కు వెళతాడని టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది ఎలక్షన్స్ టైమ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారుట. దీన్ని బట్టి వచ్చే సంక్రాంతికి గానీ, సమ్మర్ లో కానీ విడుదల అవుతుంది.