తెలంగాణ రాష్ట్రానికి నూతన సీఎస్ గా శాంతికుమారి నియమితులయ్యారు. ఈ పోస్టులో ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 1989 బ్యాచ్ కి చెందిన శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పని చేశారు. ఇప్పటివరకు సీఎస్ గా ఉన్న సోమేశ్ కుమార్ ను కేంద్రం ఏపీ కేడర్ కి కేటాయించగా, శాంతికుమారికి అవకాశం దక్కింది. కాగా, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత సీఎస్ పదవిని తొలిసారి ఓ మహిళ చేపట్టనుండడం గమనార్హం.