ఆగస్టు 6న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ఇప్పటికే జగదీప్ ధన్కర్ను బీజేపీ ప్రకటించగా, విపక్షాల తరపున అభ్యర్ధిని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత మార్గరెట్ అల్వా పోటీ చేస్తుందని వెల్లడించారు. మార్గరెట్ అల్వా 2014 ఆగస్టు వరకు రాజస్థాన్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశారు. మార్గరెట్ అల్వా ఏప్రిల్ 14 1942లో రోమన్ క్యాథలిక్ కుటుంబంలో కర్ణాటకలోని మంగుళూరులో జన్మించారు. కాగా, ఇప్పటికే 17 పార్టీలు తమ అభ్యర్ధికి మద్దతు తెలిపాయని, మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తారని శరద్ పవార్ వెల్లడించారు.