బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వలేదు..శరద్ పవార్ ట్విస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇవ్వలేదు..శరద్ పవార్ ట్విస్ట్

November 23, 2019

రాత్రికి రాత్రే మారిపోయిన పరిణామాల మధ్య మహారాష్ట్రలో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఎన్సీపీ మద్దతుతో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. తెల్లవారే సరికే ప్రభుత్వ ఏర్పాటు జరగడంతో అంతా షాక్ అయ్యారు. శివసేన వెంట నడిచిన ఎన్సీపీ ఎలా బీజేపీకి మద్దతుగా నిలిచిందని అంతా చర్చించుకున్నారు. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుతో ఎన్సీపీకి సంబంధం లేదని తన ట్విట్టర్ ద్వారా తేల్చాశారు.  

బీజేపీకి మద్దతివ్వాలనే నిర్ణయం ఎన్సీపీది కాదని చెప్పారు. అది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయంగా ఆయన పేర్కోన్నారు. తమ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలేదని స్పష్టం చేశారు. అజిత్ పవార్ స్వయంగా ఈ నిర్ణయానికి వచ్చారని దానికి తమ మద్దతు లేదని తేల్చారు. తాము ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదన్నారు. ఈ పరిణామాలపై ఇప్పటికే ఉద్దవ్ థాక్రేతో శరద్ పవార్ ఫోన్‌లో మాట్లాడారు. దీంతో అక్కడ మరోసారి పొలిటికల్ ట్విస్ట్ నెలకొంది. ఇంతకీ ఎన్సీపీ ఎమ్మెల్యేల నిర్ణయం ఎలా ఉంటుంది. వారంతా ఎవరి వెంట ఉంటారనేది తేలాల్సి ఉంది. అజిత్ నిర్ణయంతో ఎన్సీపీ అయోమయంలో పడిపోయింది. 

ఎన్సీపీది డబుల్ గేమ్ : కాంగ్రెస్ 

తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్సీపీ డబుల్ గేమ్ ఆడిందంటూ ఆ పార్టీ మండిపడింది. అవకాశవాద రాజకీయాలు చేశారంటూ ఆరోపించారు. దీన్ని విశ్వాసఘాతుకంగా అభివర్ణించారు. అధికారం కోసం ఫడ్నవీస్ ఏదైనా చేస్తారంటూ మండిపడ్డారు. శివసేన కూడా అజిత్ పవార్ తీరును ఎండగడుతోంది.