సుశాంత్ మృతిపై ఎందుకింత యాగీ? శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

సుశాంత్ మృతిపై ఎందుకింత యాగీ? శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

August 12, 2020

Sharad Pawar comments On Sushant singh Rajput Case.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అటు బాలీవుడ్ సినీ పరిశ్రమలో, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు. అలాగే సుశాంత్ తండ్రి రియా చక్రవర్తిపై పెట్టిన కేసును పాట్నా పోలీసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీహార్ ప్రభుత్వం చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో త్వరలో ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లనుంది. 

ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మృతి కేసు పెద్ద విషయమేమీ కాదన్నారు. తాను 50 ఏళ్లుగా ముంబై, మహారాష్ట్ర పోలీసులను చూస్తున్నానని, వారిపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అలాగే, ముంబై పోలీసులపై వస్తున్న ఆరోపణలపై స్పందించనని తెలిపారు. ఇటీవల శరద్ పవర్ మీడియాతో మాట్లాడుతూ..’ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. కానీ, దానికి గురించి ఎందకింత చర్చిస్తున్నారు. నా దృష్టిలో ఇది అంత పెద్ద విషయమేమీ కాదు. 20 మందికి పైగా రైతులు చనిపోతున్నారని, వాళ్ల గురించి ఎవరూ పట్టించకోవడం లేదని ఓ రైతు నా దగ్గర వాపోయాడు. ఈ కేసును సీబీఐ విచారించాలి అనుకుంటే నేను వ్యతిరేకించను.’ అని తెలిపారు.