ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. ప్రధాన చర్చ ఇదే..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ.. ప్రధాన చర్చ ఇదే..!

November 20, 2019

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సమావేశం అయ్యారు. బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో  వీరిద్దరి భేటీ జరిగింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొన్న సమయంలో ఈ భేటీ కీలకంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది.

Sharad Pawar...

రైతుల సమస్యలపై మోదీకి లేఖ ఇచ్చినట్టు శరద్ పవార్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారికి కేంద్రం నుంచి సాయం అందించాలని కోరినట్టు చెప్పారు. వీరిద్దరి మధ్య రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. వీరి భేటీ సమయంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. కాగా గురువారం మధ్యాహ్నం నాటికి ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. ఈ సమయంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది.