శరద్ పవార్ సంచలనం.. మోదీ భేటీలో వివరాల వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

శరద్ పవార్ సంచలనం.. మోదీ భేటీలో వివరాల వెల్లడి

December 3, 2019

PM Modi 01

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల వెల్లడి తర్వాత కొన్ని రోజులు అటు హస్తినలో, ఇటు మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీని తమ వైపు లాక్కునేందుకు బీజేపీ, శివసేన గట్టి ప్రయత్నాలే చేశాయి. ఓ సందర్భంలో శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ కావడం, ఆయనపై ప్రధాని పార్లమెంట్ వేదికగా ప్రశంసలు కురిపించడం అందరిని ఆశ్చర్యపరిచాయి. అప్పటి భేటీలో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియలేదు. కానీ చివరకు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శరద్ పవార్ ప్రధానితో భేటీ సందర్భంలో చర్చించిన అంశాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. 

అప్పట్లో రాజకీయాలేమి మాట్లాడలేదని శరద్ పవార్ చెప్పారు. కానీ తాజాగా ఆనాటి విషయాలను ఆ ఓ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరమూ కలిసి పని చేద్దామని మోదీ ప్రతిపాదించారని, కానీ తాను దాన్ని తిరస్కరించానని వెల్లడించారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలే ఉన్నాయని, కలిసి పనిచేసేంతగా లేవన్నానని చెప్పారు. తన కుమార్తె సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిపారు. తనకు రాష్ట్రపతి పదవి ఆఫర్ చేసిన మాటలో మాత్రం నిజం లేదని అన్నాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.