శరత్ యాదవ్ జేడీయూ ను వీడి మరో కొత్త పార్టీని పెట్టాలనే ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం. ఆయన యూపీఏ తో పొత్తుకు ఆసక్తి చూపుతున్నారు . తన తో కలసి వచ్చే కొందరు కీలక నేతలతోపాటు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులతో శరత్ యాదవ్ మాట్లాడుతున్నారని ఆయన సన్నిహితుడు విజయ్ వర్మ తెలిపారు. ఈ వారంలోనే కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
నితీశ్ ఎన్డీయేతో మళ్లి చేతులు కలపడం వలన అసంతృప్తిగా ఉన్న శరత్ యాదవ్, జేడీయూకు దూరం అయినట్టు జేడీయూ నేతలు అంగీకరించారు.తమ పార్టీలో శరత్ సీనియర్ నాయకుడు అని ఆయనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్చ ఉందని జేడీయూ అధికా ప్రతినిధి సంజయ్ సింగ్ పేర్కొన్నారు. నితీశ్ ని ఈ విషయం పై ప్రశ్నించగా ఆయన తెలిగ్గా తీసుకోవడమే కాక , ఎవరికి తెలుసు , నాకేతై భారం తగ్గచ్చు. నాకు ఇతర రాష్ట్ర యూనిట్స్ తో సంబంధం లేదు అని అన్నారట.