క్రికెటర్‌ను చూసి నమ్మలేక గూగుల్లో సెర్చ్ చేశారు.. - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెటర్‌ను చూసి నమ్మలేక గూగుల్లో సెర్చ్ చేశారు..

March 2, 2018

మన దేశంలో కాస్త పేరున్న ఏ ఆటగాళ్లకైనా పడవల్లాంటి భారీ కార్లు, వీలైతే ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలు గట్రా ఉంటాయి. సాధారణ బస్సుల్లో, రైళ్లలో పర్యటించడం వారికి నామోషి. అయితే ఓ క్రికెటర్ అతి సామాన్యుడిలా రైలెక్కి ప్యాసింజర్లకు షాకిచ్చాడు. తొలుత అతన్ని చూసిన ప్రయాణికులు గుర్తుపట్టినా, నమ్మలేక గూగుల్లోకి వెళ్లి ఫోటోలు వెతికి చెక్ చేసుకున్నారు. తమ పక్కనున్నది ఆ క్రికెటరే అని నిర్ధారించుకుని సంబరపడ్డారు. అతనితో సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. అతడెవరంటే యువ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్!

శార్దూల్ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి వచ్చాడు. మూడు రోజుల క్రితం ఏదో పనిపై వెళ్తూ అంధేరి రైల్వే స్టేషన్‌లో లోకల్‌ రైలు ఎక్కాడు. తోటి ప్రయాణికుల్లో కొందరు అతణ్ని గుర్తుపట్టారు. అయినా వారికి డౌటొచ్చింది. దేశపు జట్టు క్రికెటర్ అంత సాదాసీదాగాలోకల్‌ రైల్లో వస్తాడాని అని అనుమానపడ్డారు. అయితే ఎదురుగా ఉన్నది అతడే తెలిసిపోతుండడంతో డౌట్ తీర్చుకోవడానికి మొబైల్ ఫోన్లో గూగుల్‌ను ఓపెన్ చేసి శార్దూల్ ఫోటోలు చూశారు.

ఆ ఫొటోలను, ఎదురుగా ఉన్న అతన్ని మార్చిమార్చి చూసి అనుమానం తీర్చుకున్నారు. తర్వాత టపీటపీమని సెల్ఫీలు, ఫొటోలు కొట్టేసుకున్నారు. ఈ అభిమానంపై శార్దూల్ పొంగిపోయాడు. శార్దూల్ గతంలోనూ లోకల్ రైల్లో వెళ్లాడు. అయితే అప్పుడెవరూ ఇలా పట్టిపట్టిచూడలేదట. అప్పటికీ ఇప్పటికీ జనం చూసే చూపులో వచ్చిన మార్పును అతడు నవ్వుకున్నారు. ఐపీఎల్‌ సీజన్‌లో అతణ్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాక్కోవడం విదితమే.