ఆ షార్క్ వయసు తెలిస్తే షాక్ అవుతారు - MicTv.in - Telugu News
mictv telugu

ఆ షార్క్ వయసు తెలిస్తే షాక్ అవుతారు

December 15, 2017

ఈ భూమ్మీద ఉన్న జీవాల్లో అత్యధిక వయసుతో ఉన్న ఓ షార్క్ ను సైంటిస్టులు తెలుసుకున్నారు. ఆర్కిటిక్ జలాల్లో కనిపించే ఓ గ్రీన్ లాండ్ షార్క్ వయసు 512 సంవత్సరాలను సైంటిస్టులు తేల్చారు. అంటే క్రి.శ 1505 లో పుట్టిందన్న మాట.  సాధారణంగా 400 ఏళ్లు బతికే గ్రీన్ లాండ్ షార్క్ ల కంటే ఇది వంద సంవత్సరాలు ఎక్కువగానే  బతికింది. స్టిల్ నాటౌట్ గా సాగర జలాల్లో  స్విమ్మింగ్ చేస్తూనే ఉంది. తమకు నచ్చిన జోడి కోసం ఈ గ్రీన్ లాండ్ షార్క్ లు ఆర్కిటిక్ జలాలను జల్లెడ పడతాయట. అంటే ఈ షార్క్ కు నచ్చిన జోడి ఇంకా దొరకనట్టుంది. అందుకే 512 ఏళ్ల నుంచి సాగర జలాల్లో సెర్చ్ చేస్తూనే ఉన్నట్టుంది.