Sharmila drive an auto at the request of a fan in Khammam district
mictv telugu

ఆటో నడిపిన వైఎస్సార్‌టీపీ చీఫ్.. జై షర్మిలక్క అంటూ నినాదాలు

June 16, 2022

Sharmila drive an auto at the request of a fan in Khammam district

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర 96 వ రోజులో భాగంగా ఇవాళ (గురువారం) ఖమ్మం పట్టణంలోని ధంసలాపురం క్యాంప్ నుంచి ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జెడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగనుంది.

ఈ క్రమంలో ఓ అభిమాని కోరిక మేరకు షర్మిల ఆటో నడిపారు. ముస్తాఫా నగర్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ వేషధారణలో షర్మిల ఆటో నడపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన షర్మిల ఇప్పుడు ఆటోవాలాలను ఆకట్టుకున్నారు.