Sharmila Meet TS Governor..Whatsnext?
mictv telugu

షర్మిల బాణం గురి తప్పిందా?

December 1, 2022

Sharmila Meet TS Governor..Whatsnext?

షర్మిల బాణం గురితప్పుతుందా?కేసీఆర్ , టీఆర్ఎస్ నేతలపై తిట్ల అస్త్రం బూమరాంగ్ అవుతుందా?తెలంగాణను అఫ్ఘనిస్థాన్‌తో ,టీఆర్ఎస్ కార్యకర్తల్ని తాలిబన్లతో పోలిస్తే గులాబీసేన ఊరుకుంటుందా? ముందు ముందు పాదయాత్రకు చిక్కులు తప్పవా?కూల్‌గా సాగుతోన్న పాదయాత్ర ఎందుకు ఇలా మారింది?షర్మిల తిట్ల బాణం రాంగ్ రూట్‌లో వెళ్తుందా?

ఎవరు విసిరిన బాణమోగానీ…

బీజేపీ విసరిన బాణం అని టీఆర్ఎస్…టీఆర్ఎస్ విసరిన బాణం అని బీజేపీ.లేదు లేదు వీళ్లెవరి బాణం కాదు నాకు నేనే వచ్చానన్న షర్మిల. నిజానికి ఎవరు విసిరిన బాణమోగానీ తెలంగాణ రాజకీయంలో కాకపుట్టిస్తోంది.పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై షర్మిల విమర్శలు గుప్పించారు.ఓ దశలో స్థాయిని మించి విమర్శలు చేశారు. అయినా మీడియా ఫోకస్ లేదు అనుకున్నారేమో..ఈ విమర్శల డోస్ డబుల్,త్రిబుల్ చేశారు. ఇక్కడే గులాబీ కార్యకర్తల్లో గరం మొదలైంది. వరంగల్ జిల్లాలో సెగ పుట్టించారు.షర్మిల హైదరాబాద్‌కు వచ్చి రచ్చ రచ్చ చేశారు. షర్మిలను కారుతో సహా పోలీసులు లిఫ్ట్ చేశారు.ఇలా తీసుకెళ్లడాన్ని ఇటు బీజేపీ నేతలు,అటు గవర్నర్ తమిళి సై ఖండించారు.

ఇక్కడే పుట్టా..ఇక్కడే ఉంటా

గురువారం షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిశారు. తనపై జరిగిన దాడి, హైదరాబాద్‌లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆమెకు వివరించారు. ఆ తర్వాత రాజ్‌భవన్ ముందు షర్మిల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై పరుష పదజాలంలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ కార్యర్తల్ని తాలిబన్లతో పోల్చారు. కేసీఆర్ ది తాలిబన్ల సైన్యం అని విమర్శించారు.అంతేకాదు తెలంగాణను అఫ్ఘనిస్థాన్‌తో పోల్చారు.కేటీఆర్ భార్య ఎక్కడ నుంచి వచ్చారు..ఏపీ నుంచి రాలేదా అని ప్రశ్నించారు. ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్ను కూడా గౌరవించాలన్నారు.నేను ఇక్కడే పుట్టా..ఇక్కడే పెళ్లిచేసుకున్నా..భవిష్యత్‌లో ఇక్కడే ఉంటా అని షర్మిల అన్నారు.

గురితప్పిన బాణం

ఇక్కడే షర్మిల బాణం గురితప్పింది. టీఆర్ఎస్ నేతల్ని ఎంత తిట్టినా జనం రాజకీయంగా చూస్తారు. అదే తెలంగాణ జొలికే వస్తే పర్సనల్‌గా తీసుకుంటారు. ఇక్కడ… తెలంగాణను తాలిబన్ల రాజ్యం అఫ్ఘనిస్థాన్‌తో షర్మిల పోల్చారు.దీనిపై తెలంగాణ వాసులు ఫైర్ అవుతున్నారు. అసలు నువ్వెవరు తెలంగాణపై మాట్లాడానికి,రాజన్న రాజ్యం మాకెందుకు అని మండిపడుతున్నారు. నిజానికి పాదయాత్రకు సరిగ్గా రెస్పాన్స్ రావడం లేదు. ఎక్కడికెళ్లినా జనం ఆమెను చూసేందుకే వస్తున్నారు. ఆమె చెప్పే మాటలు సరదాగా వింటున్నారు..ఆ తర్వాత ఎక్కడ దాని గురించి మాట్లాడటం లేదు. వేల కిలోమీటర్లు నడిచినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏ గ్రామంలో ఆ పార్టీకి కేడర్ లేదు..కార్యకర్తలు లేరు.వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో కొందరు చూడటానికి వస్తున్నారు.

లైట్ తీసుకుంటున్నారా?

మొదట్లో బాగా వచ్చిన జనం ఇప్పుడు తగ్గిపోయారు. షర్మిల అంటే లైట్ తీసుకుంటున్నారు. అందుకేనేమో సీఎం కేసీఆర్ , టీఆర్ఎస్ నేతలపై డోస్ పెంచారు షర్మిల. స్థానిక నేతలను వదలడం లేదు. లోకల్‌ని టచ్ చేస్తే ఊరుకుంటారా? తిరగబడతారు.సరిగ్గా వరంగల్‌లో జరిగింది ఇదే. షర్మిల మాటలు బూమరాంగ్ అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఎంతతిట్టినా పట్టించుకోని గులాబీ కేడర్ ఇక ముందు అలా ఉండకపోవచ్చు. తెలంగాణను అప్ఘనిస్థాన్‌తో పోల్చడం అంటే వారిలో ఆవేశం కట్టలు తెగుతుంది. అంతేకాదు తాలిబన్లతో పోల్చారు.ఇక తాడోపేడో తేల్చుకుంటారు ఆపార్టీ కార్యకర్తలు. అందుకే షర్మిల ఇప్పటికైనా గుర్తించుకోవాలి. తిరుగుతున్నది తెలంగాణలో అని,,తిడుతున్నది తెలంగాణ తెచ్చినోళ్లను అని,లేదంటే బాణం గురితప్పుంది. రివర్స్ లో గుచ్చుకుంటుంది.